తెలంగాణపై కావాలనే గందరగోళం: మల్లు

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన స్పష్టంగా ఉందని, కావాలనే కొంత మంది గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెసు నాయకుడు, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే చిదంబరం ప్రకటన ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగిపోతుందని ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. చిదంబరం తాజా ప్రకటనపై ఎవకు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఆందోళన సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు, ఉద్యమకారులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపుతామని కేంద్ర ప్రకటనలో లేదని, భావోద్రేకాలు ఎగిసిపడుతున్న సమయంలో ఎటువంటి నిర్ణయాలు జరగవని, ముందు శాంతిభద్రతలు అదుపులోకి ప్రశాంత వాతావరణం ఏర్పడాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. అన్ని వర్గాలతో, అన్ని పార్టీలతో చర్చించి ముందుకు సాగుతామని చిదంబరం స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. కొంత మంది ప్రజలకు సరైన సమాచారం అందించడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+