వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లగడపాటి అదృశ్యంపై నామ్ కే వాస్తే విచారణ

ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ ఎంఎం భగవత్, డీసీపీ విజయ కుమార్‌తోపాటు ఆదివారం రాత్రి ప్రభుత్వాసు పత్రిలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికా రులను అతిధి గృహానికి పిలిపించి పలు వివరా లను రాబట్టినట్లు సమాచారం. సుమారు రెండు గంటలపాటు హడావుడి నెలకొంది. అనంతరం ఆయన అతిధి గృహం నుచి బయటకు వెళ్లి పోయారు. అయితే ఎక్కడకు వెళ్లింది ఎవరికీ తెలి యలేదు. విచారణ మొత్తాన్ని చాలా గోప్యంగా ఉంచారు. అదనపు డీజీపీ శివనారాయణ ప్రభు త్వాసుపత్రికి వస్తారని పోలీసులు కూడా భావిం చారు. అయితే రాత్రి పది గంటల వరకు కూడా ఆయన అక్కడకు వెళ్లలేదు. విచారణకు సంబం ధించిన వివరాలను వెల్లడించేందుకు కూడా కమిషనరేట్ వర్గాలు నిరాకరించాయి.