ఒయులో కాల్పులు: హైదరాబాద్ లో ఉద్రిక్తం

హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రాంతంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. విద్యార్థులను తరిమి తరిమి కొట్టారు. నిజాం కళాశాల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లోని సినీ యాక్టర్ల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. మోహన్ బాబుకు చెందిన పాఠాశాలపై ఆందోళనకారులు దాడి చేశారు. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పై కూడా దాడి జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై కాల్పులను కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు ఖండించారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications