వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉస్మానియాలో ర్యాలీ: జెఎసి నేతల అరెస్టు

కాగా, తెలంగాణ అంతటా నిరసనలు, ఆందోళనలు సాగుతున్నాయి. హైదరాబాదులో విద్యార్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లిలో సినినీటుడు పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పై ఆందోళనకారులు దాడి చేశారు. మిర్యాలగూడాలో ఆంధ్రా హోటళ్లపై దాడులు జరిగాయి. హైదరాబాదులో తెలంగాణ అమర వీరులకు విద్యార్థులు నివాళులు అర్పించారు. మా తెలంగాణ మాకు కావాలంటూ నినాదాలు చేశారు. కూకట్ పల్లిలో ఆందోళనకారులు బస్సుకు నిప్పు పెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి.