రాజధానికి ఆర్టీసీ బస్సులు లేక బెజవాడ జనం బేజారు

మరోవైపు ఇతర డిపోల నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సులకు సంబంధించి ప్రయాణికులకు చార్జీలు తిరిగి చెల్లించారు. బుకింగ్ కౌంటర్ల వద్ద అడ్వాన్స్ రిజర్వేషన్‌ను నిలిపివేశారు. సమాచార కేంద్రం ద్వారా తెలంగాణ , హైదరాబాద్, ఖమ్మం, తిరువూరు, భద్రాచలం రూట్లలో బస్సులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ రూటులో బస్సులు రద్దవడంతో టికెట్లను కౌన్సిల్ చేయించుకునేందుకే బస్టాప్‌లో బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరి నిలబడ్డారు. హైదరాబాద్‌కు వెళ్ళాల్సిన ప్రయాణికులు కొందరు ఇంటికి తిరుగుముఖం పట్టగా మరికొందరు రైల్వేస్టేషన్‌కు పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications