హైదరాబాద్: కేంద్ర మంత్రిగా రాజీనామా చేయాలని ఎస్ జైపాల్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి తెచ్చేందుకు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో సహా మిగతా తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆయన కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా సోనియా గాంధీకి పంపారు.
తెలంగాణ ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితి విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామి రాష్ట్ర మంత్రి డికె అరుణ హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజల్లోంచి వచ్చిందని, నాయకులు వారిని అనుసరించక తప్పని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. పదవులకు రాజీనామాలు చేయాలని తమపై ఒత్తిడి పెరుగుతోందని ఆమె చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి