తెలంగాణపై సోనియా వెనక్కి పోయారు: ఎర్రబెల్లి దయాకర రావు

రాయలసీమ, కోస్తాంధ్రల్లో విధించని 144 సెక్షన్ తెలంగాణలో విధించారని, ఇది ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. పోలీసులు విద్యార్థులను పశువులను కొట్టినట్లు కొడుతున్నారని, తరిమి తరిమి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వైఖరిని రోశయ్య మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల జెఎసి సమావేశానికి తాము మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ, పోచారం శ్రీనివాస రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రతినిధులుగా పంపినట్లు ఆయన తెలిపారు. జెఎసికి రాజకీయేతరులు నాయకత్వం వహిస్తేనే తాము అందులో చేరుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications