చిదంబరం ప్రకటనతో శాంతించిన విశాఖ విద్యార్ధులు

ఆందోళనకు తొలి అడుగు వేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం చివరి వరకు సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచింది. 12 రోజుల పాటు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా వీరిని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించినా..వైద్యం నిరాకరించి తమ దీక్షలను కొనసాగించారు. వీరికి మద్దతుగా ఏయూ నుంచే వివిధ రాజకీయ పక్షాలు ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నాయి. విద్యార్థులకు సంఘీభావం తెలిపాయి. తొలి నాలుగు రోజులు విద్యార్థులే ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రెండు రోజులు నగర బంద్ నిర్వహించారు. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, రవాణా, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి.












Click it and Unblock the Notifications