హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం నేత నాగం జనార్దన్ రెడ్డిపై దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తిని గురువారం సాయంత్రమే గుర్తించగా, మరో వ్యక్తిని శుక్రవారం కూడా గుర్తించారు. నాగం జనార్గన్ రెడ్డిపై దాడి చేసిన ఒక వ్యక్తిని శ్రీకాంతరాజు అలియాస్ నాగరాజుగా గుర్తించారు. అతను పలు కేసుల్లో నిందితుడు. విద్యార్థుల్లోకి చొరబడి తెలుగుదేశం నాయకులపై అతను దాడి చేశాడు.
నాగం జనార్దన్ రెడ్డిపై దాడి చేసిన మరో వ్యక్తిని రాజీవ్ రెడ్డిగా గుర్తించారు. ఇతను హైదరాబాదులోని ఎల్బీ నగర్ కోర్టులో న్యాయవాదిగా చేస్తున్నట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. నాగం జనార్దన్ రెడ్డిని పలువురు రాజకీయ నాయకులు పరామర్శిస్తున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఆయనను పరామర్శించారు. నాగం జనార్దన్ రెడ్డిపై దాడికి సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి