న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత మంత్రులకు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఇచ్చిన విందుకు జై ఆంధ్ర నేతలు హాజరయ్యారు. వారి రాకకు మొదట తెలంగాణ నేతలు ఆశ్చర్యపోయారు. తరువాత జై ఆంధ్ర అంటే ఒక రకంగా జై తెలంగాణకు మద్దతు ఇవ్వడమేననుకున్నారు. తాము జై ఆంధ్ర కోరుకుంటున్నందున తెలంగాణవాదులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఎంపి హర్ష కుమార్‌లు తెలిపారు. స్నేహపూర్వకంగా విడిపోతామని వారన్నారు.
ఈ సందర్భంగా విహెచ్ విలేకరులతో మాట్లాడుతూ ఇరు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా విడిపోదామన్నారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అక్కడ బలపడుతోందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులు ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంతంలోనూ, ఆంధ్ర ప్రాంతంలోనూ విద్యార్థులపై పెట్టిన కేసులు అన్నింటినీ ఎత్తివేయాలని ఆయన కోరారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి