తెలంగాణపై పిసిసి సమావేశం పెట్టండి: అనంత వెంకటరామిరెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: తెలంగాణపై జనవరి 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ముందే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) సమావేశం ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కోరారు. ఈ మేరకు ఆయన డి. శ్రీనివాస్ కు గురువారం ఒక లేఖ రాశారు. పిసిసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజనపై పిసిసి పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను క్రోడీకరించి వాటిని 5వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని ఆయన అన్నారు. కాగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి హైదరాబాదులోని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. తెలంగాణ మంత్రులు కూడా డి. శ్రీనివాస్ తో భేటీ అయ్యారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి