వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖపట్నం మహానగరంలో మరో ఫ్లై వోవర్ బ్రిడ్జి

ఈ నేపథ్యంలో చావుల మదుం బ్రిడ్జిపై ఫ్లై ఓవర్ ను నిర్మించాలని జీవీఎంసీ చాలా కాలం నుంచి కసరత్తు చేస్తోంది. రైల్వే శాఖ నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో తక్షణమే ఈ పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకు రూ. 20 కోట్లు వరకు నిధులు అవసరం కాగా, మొత్తం జీవీఎంసీ భరించాల్సి ఉంది.
ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ ప్రారంభమై రైల్వే స్టేషన్‌కు ముందు ఉన్న అల్లిపురం వెళ్లే జంక్షన్ వద్ద ముగియనుంది. 1.1 కిలోమీటర్ పొడవునా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు జీవీఎంసీ ప్రాజెక్టు అధికారులు అంచనాలు తయారుచేస్తున్నారు. ఫ్లై ఓవర్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్ది నగరానికే తలమానికంగా తయారుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ జంక్షన్ ను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయునున్నారు.