వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలపై తెలంగాణ మంత్రుల్లో విభేదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Komitireddy Venkat Reddy-Sridhar Babu
హైదరాబాద్: రాజీనామాల ఉపసంహరణపై తెలంగాణ మంత్రుల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ సీనియర్ మంత్రులు రాజీనామాల ఉపసంహరణకు సిద్ధపడగా జూనియర్ మంత్రులు అందుకు నిరాకరిస్తున్నారు. జనవరి 5వ తేదీన జరిగే చర్చలు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియగానే భావిస్తూ రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు జె. గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి మంత్రులు తెలిపారు. తెలంగాణ ప్రక్రియ నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గినట్లు భావించినా తాము తిరిగి మళ్లీ రాజీనామాలు చేస్తామని, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ స్థాయికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మళ్లీ ఎన్నికలంటూ జరిగితే ప్రత్యేక తెలంగాణలోనే వస్తాయని ఆయన అన్నారు. ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు మాత్రం రాజీనామాలు ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తున్నారు.

తెలంగాణ మంత్రుల ఉపసంహణపై విద్యార్థి సంఘాల జెఎసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజీనామాల ఉపసంహరణ ద్వారా మంత్రులు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారని జెఎసి నేతలు విమర్శించారు. కాంగ్రెసు నేతలు చిత్తశుద్ధితో నిలబడడం లేదని వారన్నారు. తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలు ఉపసంహరికోబోమని చెప్పిన మంత్రులు పదవులు కాపాడుకోవడానికి మాట తప్పారని వారన్నారు. మంత్రులను గ్రామాల్లో తిరగనివ్వవద్దని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X