వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపు గవర్నర్ నరసింహన్ సర్వదర్శనం

నరసింహన్ తివారీ స్ధానంలో గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన రాజ్ భవన్ కి వచ్చిన మర్నాడే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరపడం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి పాలన విధించడానికే నరసింహన్ వంటి ఘటికుడిని గవర్నర్ గా పంపారన్న విశ్లేషణలు వచ్చాయి. నరసింహన్ చత్తిస్ గఢ్ గవర్నర్ గా ఆదివాసీల ఉద్యమాన్ని అణిచివేశారని, ఆయన నరహంతకుడని కొందరు మావోయిస్టు నాయకులు విమర్శించారు. నరసింహన్ గతంలో ఐపిఎస్ ఆఫీసర్ గా రాష్ట్రంలో కొంతకాలం పనిచేశారు.