వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంటనగరాల్లో వేడుకలకు భారీ బందోబస్తు

By Santaram
|
Google Oneindia TeluguNews

Necklace Road
హైదరాబాద్: నూతన సంవత్సర ఆరంభ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జంట కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గస్తీని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. దాంతోపాటు వేడుకలు జరిగే హోటళ్లు, రిసార్టులు, ఇతర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కొన్నిచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ బి.ప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుఝాము 2 గంటల వరకు అమల్లో ఉంటాయి.

విశ్వేశ్వరయ్య విగ్రహం వైపు నుంచి నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే వాహనాలను విశ్వేశ్వరయ్య వి గ్రహం వద్ద నుంచి ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌ వైపు మళ్లిస్తారు. బూర్గుల రామకృష్ణారావు భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చేవాహనాలను ఇక్బాల్‌ మినార్‌, లక్డీకాపూల్‌, అయోధ్య హోటల్‌ వైపు పంపిస్తారు. లిబర్టీ జంక్షన్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను ఎంసిహెచ్‌ కార్యాలయం వై జంక్షన్‌ నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్‌, తెలుగుతల్లి, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, లక్డీకాపూల్‌ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ వైపు వచ్చే వాహనాలను ఖైరతాబాద్‌ నుంచి మీరా థియేటర్‌ లేన్‌ వైపు పంపుతారు.

సచివాలయం పక్కనే ఉన్న మింట్‌ కాంపౌండ్‌ రోడ్డును మూసేస్తారు. కనల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్యపార్కు, నెక్లెస్‌ రోడ్డు వైపు వాహనాలను అనుమతించరు. ఇటుగా వచ్చినవారిని కర్భలామైదాన్‌, మినిస్టర్స్‌ రోడ్డు వైపు పంపుతారు. సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వచ్చే వాహనాలను సెయిలింగ్‌ క్లబ్‌ వద్ద నుంచి కవాడీగూడ చౌరస్తా, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ ఆలయం వైపు పంపిస్తారు. వాహనదారులు ఆలయం నుంచి ఎడమవైపు తిరిగి అశోక్‌ నగర్‌, ఆర్టీసి క్రాస్‌ రోడ్స్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X