సంప్రదింపుల ప్రక్రియకే చర్చలు: చిదంబరం

తెలంగాణపై చర్చల్లో అందరినీ భాగస్వాములను చేస్తామని, ప్రశాంతంగా ఉండాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ జనవరి 3వ తేదీన ఢిల్లీ బయలుదేరి వస్తున్నారు. కాంగ్రెసు తరఫున ఇద్దరు నేతలు ఢిల్లీకి వస్తారని శ్రీనివాస్ తెలిపారు. ఈ చర్చలకు ముఖ్యమంత్రి కె. రోశయ్యను పార్టీ తరఫున ఆహ్వానిస్తారా, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిగా ఆయనకు అహ్వానం అందుతుందా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications