తెగే దాగా లాగవద్దు: కెసిఆర్

తెలంగాణవారు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారని, వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. తెలంగాణలోని ఆంధ్రుల బాగోగులను దృష్టిలో ఉంచుకుని సీమాంధ్ర నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలను శాంతిమార్గంలో నడిపించాలని ఆయన సూచించారు. తెలంగాణది కొత్త సమస్య కాదని ఆయన అన్నారు. విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని, వారిని కాళ్లు మొక్కి దీక్షలు విరమింపజేశామని ఆయన చెప్పారు. ప్రజలను ఉసిగొల్పడం మంచిది కాదని ఆయన అన్నారు. తమ మాటలను తెలంగాణ వ్యతిరేకులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఇరుగు పొరుగు రాష్టాలుగా ఉండబోతున్నామని, అందువల్ల సామరస్యం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications