వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి, సినీ రంగాలు బాగానే ఉన్నై: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Komitireddy Venkat Reddy
హైదరాబాద్: ఐటి, సినిమా రంగాలు బాగానే ఉన్నాయని రాష్ట్ర ఐటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ రంగాలు బాగానే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆందోళన వ్యక్తం చేయడం సరి కాదని ఆయన అన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా రోశయ్య మాట్లాడుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా రోశయ్య మాట్లాడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్యపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము ఎవరం చెన్నైకి వెళ్లాలని తాము చెప్పలేదని సినీ ప్రముఖులు చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ నక్సలైట్లు, నక్సలైట్లు చేరిపోయారని పోలీసు ఉన్నతాధికారులు అనడం తెలంగాణ విద్యార్థులను అవమానించడమేనని ఆయన అన్నారు. ఉత్తర కోస్తాలో కూడా నక్సలిజం ఉందని, సమైక్యాంధ్ర ఉద్యమం అక్కడ సాగినప్పుడు ఆ మాటలు అనకపోవడంలోని ఆంతర్యం తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకే ఈ విధమైన మాటలు చెబుతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు తెలంగాణ మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకోబోమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతపై రోశయ్య స్పందించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో పెట్టిన కేసుల కన్నా తెలంగాణ ఉద్యమకారులపై ఎక్కువ కేసులు పెట్టారని ఆయన అన్నారు. రోశయ్య ఆంధ్ర ప్రాంతానికే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆందోళనల వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే మాటలో వాస్తవం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రకటనకు కట్టుబడి ముఖ్యమంత్రి రోశయ్య చొరవ తీసుకుని సీమాంధ్ర నాయకులను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.

అన్ని రాజకీయ పార్టీల గుట్టు బయటపడబోతున్నాయని, రెండు పడవలపై కాలు పెట్టిన తెలుగుదేశం పార్టీ బండారం బయట పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించామని కాంగ్రెసుకు చెందిన యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారని, కాంగ్రెసు పార్టీ వైఖరి ఆ విధంగా స్పష్టమైందని, అందువల్ల కాంగ్రెసు పార్టీ వైఖరి గురించి కొత్తగా అడగాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సిఎల్పీ సమావేశం కూడా తెలంగాణకు ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. సిఎల్పీ నిర్ణయానికి వ్యతిరేకంగా శాసనసభ్యులు వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. చంద్రబాబును విమర్శిస్తూ సిఎల్పీ నిర్ణయానికి కట్టుబడిన కాంగ్రెసు శాసనసభ్యులపై ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X