Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లగడపాటి అదృశ్యంలో పోలీసుల నిర్లక్ష్యం లేదు

Lagadapati Rajagopal
విజయవాడ: ఎంపీ లగడపాటి అదృశ్యంలో పోలీసుల నిర్లక్ష్యం లేదని దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రి నుంచి ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అదృశ్యమైన ఘటనపై సీఐడీ అదనపు డీజీ శివన్నారాయణ విచారణ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఆ నివేదికను డీజీపీ ఆర్‌ఆర్‌ గిరీష్‌కుమార్‌కు పంపగా, అందులో పోలీసుల ప్రమేయంలేదనే విషయం నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఎంపీ 15 గంటలపాటు కనిపించకుండా పోవటాన్ని ప్రభత్వం తీవ్రంగా పరిగణించింది.

దీంతో సీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సెంట్రల్‌జోన్‌ ఏసీపీ ఆవుల సుబ్బారావు, మాచవరం సీఐ లక్ష్మీపతి, పాయకాపురం సీఐ ధర్మేంద్ర, మాచవరం క్రైం ఎస్‌ఐ కమలాకర్‌, గవర్నర్‌పేట ఎస్‌ఐ భాస్కరరావును సస్పెండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సీఐడీ అదనపు డీజీ శివన్నారాయణను విచారణాధికారిగా నియమించింది. శివన్నారాయణ రెండు రోజులపాటు విచారణ జరిపి నివేదికనిచ్చారు.

దీని ఆధారంగా సస్పెన్షన్‌ను తొలగించాలని డీజీపీ నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితమే సీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ను ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి కే రోశయ్య హామీ ఇచ్చారు. ఎక్కడి వారికి అక్కడే పోస్టింగ్‌ ఇచ్చేందుకు సుముఖతను కూడా వ్యక్తం చేశారు. సస్పెన్షన్‌లను ఎత్తివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+