ఉద్యమం ఆగదు: తెలంగాణ జెఎసి

జెఎసి సమావేశంలో చేసిన తీర్మానాలను కన్వీనర్ కోదండరామ్ మీడియా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణపై రాజకీయ పార్టీలను కేంద్రం చర్చలకు ఆహ్వానించడం శుభపరిణామమని ఆయన అన్నారు. బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేసినందకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు శాంతియుతంగా, పల్లె పల్లెనా ఆందోళనలు కొనసాగించాలని జెఎసి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. శాసనసభ్యుల రాజీనామాల ఆమోదానికి స్పీకర్ పై ఒత్తిడి తేవాలనే నిర్ణయాన్ని జనవరి 5వ తేదీ వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కోదండరామ్ చెప్పారు. దానిపై 5వ తేదీ తర్వాత చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications