వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై చిదంబరం ఓవరాక్షన్: గాలి ముద్దుకృష్ణమ నాయుడు

చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వర్గీయ ఇందిరాగాంధీ వ్యతిరేకించేవారని, అదే విధానాన్ని ఆణె కోడలు సోనియా గాంధీ పాటించాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం నీరు గారలేదని, అది మరింత బలపడుతుందని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై కాంగ్రెసు గానీ యుపిఎ గానీ వివరణ ఇవ్వకుండా తెలంగాణపై రాజకీయ పార్టీలను ఎలా చర్చలకు పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెసు, యుపిఎ వైఖరి చెప్పిన తర్వాతనే చర్చలకు ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు. యుపిఎ భాగస్వామ్య పార్టీలకు చెందిన నాయకులు మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటివారు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.