4న సమైక్యవాదుల సీమాంధ్ర బంద్

Krishna Barrage
విజయవాడ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు ఈ నెల 4వ తేదీన రాయలసీమ, కోస్తాంధ్ర బంద్ కు పిలుపునిచ్చారు. సమైక్యవాదులు శనివారం విజయవాడలో సమావేశమై సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు. చిదంబరం రాజకీయ పార్టీలతో చర్చించే ఐదో తేదీన బ్లాక్ డేగా పాటిస్తామని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ప్రకటించారు. సమైక్య నినాదాన్ని డిల్లీకి తీసుకుని వెళ్తామని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జెఎసి ప్రకటించింది.

సీమాంధ్ర శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల రాజీనామాలకు ఒత్తిడి తేవాలని కూడా జెఎసి నిర్ణయించింది. ఈ సమావేశంలో మాజీ మండలి బుద్ధప్రసాద్ తో పాటు సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రల్లోని విశ్వవిద్యాలయం విద్యార్థులు తరలి వచ్చారపు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు వంటి తెలుగుదేశం నాయకులు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+