సరిగా సాగలేకపోతున్న బిజెపి 'జై ఆంధ్ర' దుకాణం

ఈనేపథ్యంలో నగరంలో డిసెంబరు 29వ తేదీన బీజేపీ కార్యాలయం దీనదయాళ్ భవన్‌లో జిల్లా, నగర నాయకులు సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సమైక్యవాదులు కొందరు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈలోపు కొత్త సంవత్సర వేడుకలు రానేవచ్చాయి. ఆ రోజున బీజేపీ, మరికొందరు ప్రత్యేక ఆంధ్రను కోరుతున్నవారితో కలసి ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే తాజాగా సమైక్యాంధ్రవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు నిర్ణయించడంతో తమ ప్రచార నిర్వహణపై పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రప్రభుత్వం 5న జరిపే సమావేశం ఫలితాలను బట్టి జై ఆంధ్ర ప్రచారాన్ని ప్రారంభిస్తేనే మేలని కొందరు సీనియర్ నాయకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications