వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలిసుంటే కలిసొచ్చేదేమిటి: హరిరామ జోగయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Harirama Jogaiah
హైదరాబాద్‌: విభజన వలన కాక, కలిసి ఉండటం వల్లనే ఆంధ్ర ప్రాంతం ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలరని సమైక్య వాదులను మాజీ ఎంపీ హరిరామజోగయ్య ప్రశ్నించారు. కోస్తా, సీమ ప్రాంతాల అభివృద్ధి కన్నా, హైదరాబాద్‌లో సొంత ఆస్తుల పరిరక్షణకే 'సమైక్యవాదం' చేపట్టారనడం వాస్తవమో కాదో వివరించాలన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం సాధించినదేమిటో చెప్పాలంటూ.. సమైక్య వాద నేతలకు ఆయన ఏడు ప్రశ్నలను సంధించారు.

జోగయ్య ప్రశ్నల పరంపర ఇదీ
1. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌గా ఉండాలా? వద్దా?
2. సీమ, కోస్తాల్లోని వెనకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందాయని అనుకుంటున్నారా? తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి జరిగితే.. సమైక్య రాష్ట్రాన్ని ఎలా సమర్థిస్తారు?
3. 610 జీవో వల్ల ఆంధ్రా ప్రాంతం వారికి జరుగుతున్న నష్టాల గురించి ఏనాడైనా స్పందించారా? సామాన్యుడి అవస్థల కన్నా హైదరాబాద్‌లో మీ ఆస్తులు రక్షణకే సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్నారా?
4. హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధిని గురించి ఎన్నడైనా ఆలోచించారా? సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమనుకుంటే ఇంతవరకు ఇతర నగరాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు?
5. రెండు లేదా మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా?
6. 42 మంది ఎంపీలు ఉన్న మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సాధించింది ఏమిటి ? తక్కువ ఎంపీలున్న చిన్న రాష్ట్రాలు సాధించలేనిది ఏమిటి?
7. సమైక్య ఆంధ్ర సాధించేవరకు మీ రాజీనామాలను ఉపసంహరించుకోకుండా ఉంటారా? అర్ధంతరంగా విరమించుకుంటారా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X