కెసిఆర్ ను కలిసిన ప్రజారాజ్యం తెలంగాణ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే, తాను పీఆర్పీ విప్‌ను పట్టించుకో కుండా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిన్న నిర్మల్ లో స్పష్టం చేశారు. సామా జిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఆవి ర్భవించిన ప్రజారాజ్యం పార్టీ ప్లేటు మార్చి సమైక్యవాదానికి మద్దతు పలి కిందని దుయ్యబట్టారు. శనివారం రాత్రి నిర్మల్‌లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. పార్టీ సిద్ధాంతాలను కాలరాసిన చి రంజీవిని కేంద్రం చర్చలకు ఆహ్వనిం చడం తెలంగాణ ప్రజల మనోభావాల ను కించపరచడమేనన్నారు.
పారితోషికం తీసుకుని డైలాగులు చెప్పే నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన పీఆర్పీ ఎమ్మెల్యేగా తనకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని సోనియాగాంధీ, చిదంబరంలకు ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రాలు పంపుతానని, ఆదివారం ఢిల్లీ వెల్లి కలుస్తానన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యా గానికైనా వెనుకాడేది లేదని, తెలంగాణ కోసం అవసరమైతే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఈ సందర్భంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications