తిరుమల: రెండు గంటల్లోనే స్వామి వారి దర్శనం

తిరుమలలో శనివారం సాయంత్రం శ్రీవారి ప్రణ య కలహోత్సవం వేడుకగా సాగింది. ప్రతి ఏటా ఉత్సవమూర్తులు శ్రీమలయప్ప, అమ్మవార్లకు నిర్వహించే వినోదభరిత కార్యక్రమమే ప్రణయ కలహోత్సవం. వేటకు వెళ్లి వచ్చిన శ్రీవారిని చూసి అమ్మవారు కోపగించడం, శాంతించాల్సిందిగా అమ్మవారిని స్వామివారు ప్రార్థించడంపై అత్యంత భక్తిరసభరితంగా ఈ ఉత్సవం సాగింది. ఈ సందర్భంగా తూర్పు మాడవీధిలో సాయంత్రం 5 గంటలకు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారు, అమ్మవారి తరపున జీయంగార్లు పూల బంతులను విసురుతూ కార్యక్రమాన్ని వినోదభరితంగా నిర్వహించారు.
అంతకు ముందు అమ్మవార్లతో కలసి స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు దంపతులు, ప్రత్యేకాధికారి ఏవీ.ధర్మారెడ్డి దంపతులు, డాలర్ శేషాద్రి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications