బంద్ ల వల్లే ఆర్టీసి చార్జీల పెంపు: జెసి దివాకర్ రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ఇష్టారాజ్యంగా బంద్ లు నిర్వహించడం వల్లనే ఆర్టీసి బస్సు చార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని కాంగ్రెసు సీనినయర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఇటీవలి సంఘటనల వల్ల అనేక విధాలుగా ఆర్టీసి పోయిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చార్జీలు పెరగడానికి పరోక్షంగా ఉద్రిక్త పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. ఆర్టీసి ఎండి ఎస్ ఎస్పీ యాదవ్ తీరును ఆయన వ్యతిరేకించారు. మంత్రుల కన్నా ఆర్టీసి ఎండి గొప్పవాడు కాడని ఆయన అన్నారు. యాదవ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు.
ఆర్టీసి చార్జీల పెంపును ప్రభుత్వ విప్ శైలజానాథ్ కూడా వ్యతిరేకించారు. పెంపు వల్ల సామాన్యుడిపై పెను భారం పడుతుందని ఆయన అన్నారు. పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. చార్జీల పెంపును మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కూడా నిరసించారు. ప్రతిపక్షాలు మాత్రమే అప్పుడే ఆందోళనలకు దిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ బస్ డిపోల వద్ద ఆందోళనకు దిగారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి