శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మధ్య జరిగిన 22 గంటల ఎదురు కాల్పులు ముగిశాయి. భద్రతా బలగాల చేతిలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. హోటల్లో దూరి కాల్పులు ప్రారంభించిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో మరణించారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఎదురు కాల్పులు బుధవారం రాత్రి కూడా కొనసాగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు, ఒక సిఆర్పిఎఫ్ జవాను, ఒక పౌరుడు మరణించగా, పది మంది గాయపడ్డారు. శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైన అమీరా కాదల్ వంతెన సమీపంలో గల హోటల్లోకి దూరి భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు.. లోపలి నుంచి వారు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు.
ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకతను స్థానికుడైన ఉస్మాన్ కాగా, మరొకతను పాకిస్తానీ అని తెలుస్తోంది. 2007 అక్టోబర్ నుంచి శ్రీనగర్ లో ఇది తొలి ఫిదాయీ దాడి. ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ అధికారులను లక్ష్యంగా చేసుకుని పికెట్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు మరణించాడు. వెంటనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. హోటళ్లోకి వెళ్లి ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరుపుతున్నారు. హతమైన ఇద్దరు ఫిదాయిలు కూడా లష్కరే తోయిబాకు చెందినవారని అధికారులు చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి