గాంధీభవన్ ను వేదికగా చేసుకోవద్దు: డి శ్రీనివాస్

మీడియా చానెళ్లలో సీనియర్ కాంగ్రెసు నాయకులు కూడా పార్టీ విధానానికి భిన్నంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడేవారిని సహించబోమని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. వైయస్ మరణంపై పాత సమాచారం చూపించి రెచ్చగొట్టడం సరికాదని ఆయన అన్నారు. వైయస్ మరణంపై సిబిఐ విచారణ జరుగుతోందని, అది పూర్తయ్యే వరకు వేచి చూడడం మంచిదని ఆయన అన్నారు.
దాడులు అనాగరికమని, గాంధీభవనలో ఎలాంటి నిరసనలు చేయకూడదని ఆయన సూచించారు. పరీక్షలు రాయాలని విద్యార్థులు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు. వార్తా కథనాల ప్రసారం విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. తమ పార్టీ నేతలు మాట్లాడే విషయాలను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications