వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై త్వరలో కమిటీ: కెఎస్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: తెలంగాణపై రెండు, మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేస్తుందని కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సబ్యుడు కె. సాంబశివరావు చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో శుక్రవారం భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైతే చర్చలకు అవకాశం ఉంటుందని తాను సోనియాతో చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై తన మనసులోని మాటను సోనియాకు చెప్పినట్లు ఆయన చెప్పారు. ఆందోళనలు, నిరసనలు, పరస్పర నిందారోపణలు మాని ప్రశాంత వాతావరణం ఏర్పడితే సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి వీలు అవుతుందని ఆయన చెప్పారు.

కాగా, కాంగ్రెసు కోర్ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమవుతోంది. తెలంగాణపై ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితి విధించడానికి వీలవుతుందా లేదా అనే ఆంశాన్ని కూడా కోర్ కమిటీ పరిశీలిస్తుంది. చర్చల ప్రక్రియకు కమిటీ వేయాలా, వేస్తే ఆ కమిటీ ఎలా ఉండాలి, కాలపరిమితి ఎంత పెట్టాలి వంటి అంశాలపై కాంగ్రెసు కోర్ కమిటీ చర్చిస్తుంది. అలాగే, రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ ను కొనసాగించాలా, వద్దా అనే అంశాన్నికూడా పరిశీలించే అవకాశం ఉంది. రిలయన్స్ కార్యాలయాలపై దాడులు కూడా చర్చల్లో ప్రధానం కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X