'డ్రాగన్' మూవీ గ్లింప్స్ వేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్..!
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించిన గ్లింప్స్ సిద్ధం అవుతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ గ్లింప్స్ రిలీజ్ కు మేకర్స్ టైమ్ లాక్ చేసారు. ఈ మూవీ గ్లింప్స్ రేపు అంటే మే 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు సోషల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు. ఈ న్యూస్ బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఏ రేంజ్ లో మాస్ ఎలివేషన్లతో చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.
ఇక ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ అఫీషియల్ అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని గ్లింప్స్ చివరలో ప్రకటించనుంది చిత్ర యూనిట్. అలాగే ఈ మూవీ గ్లింప్స్ దాదాపు నాలుగు నిమిషాలకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. అయితే డ్రాగన్ మూవీ గ్లింప్స్ రిలీజ్ కు ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది అని చెప్పొచ్చు. ఏం జరిగిందంటే..? గతేడాది భారీ అంచనాల మధ్య ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రిలీజైన మూవీ వార్ 2.. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేక పోయింది.

వార్ 2 మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత నాగవంశీ రూ. 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. కానీ ఫ్లాప్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కనీసం రూ. 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా తెలుగు వెర్షన్ నుండి రాలేదు. అయితే ఈ మూవీని చాలా రోజుల తర్వాత గతవారం స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ చేశారు. అయితే ఈ మూవీ టీవీ టెలికాస్ట్ లోనూ మంచి రెస్పాన్స్ సాధించలేకపోయింది. ఘోరమైన డిజాస్టర్ రేటింగ్స్ ను నమోదు చేసుకుంది. BAARC సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో 2.37 రేటింగ్స్ మాత్రమే నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఒక స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయిలో తక్కువ రేటింగ్స్ నమోదు కాలేదని ఇది ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కు చాలా అవమానకరమైన రేటింగ్స్ అని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications