ఆ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది

టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాల రొటీన్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ, రియలిస్టిక్ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు రాగ్ మయూర్. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన అద్భుత చిత్రం 'సినిమా బండి' విడుదలై ఈ మే 15 నాటికి విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాగ్ మయూర్ తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఒక నటుడిగా నా మొదటి సినిమాకే 'మరిడేశ్ బాబు' లాంటి అద్భుతమైన, ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాత్ర దొరకడం నా అదృష్టం. అంతకంటే బెస్ట్ డెబ్యూని నేను ఊహించలేను" అంటూ రాగ్ మయూర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల మైల్‌స్టోన్ సందర్భంగా తనకు ఈ లైఫ్ చేంజింగ్ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ & డి.కె లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Rag Mayur Inspiring Tollywood Journey From Cinema Bandi to Garividi Lakshmi

'సినిమా బండి' సక్సెస్ తర్వాత రాగ్ మయూర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.కీడా కోలా, వీరాంజనేయులు విహారయాత్ర, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాలతో అటు యూత్‌కు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా హిందీ సూపర్ హిట్ సిరీస్ 'పంచాయత్' రీమేక్‌గా వచ్చిన 'సివరాపల్లి' సిరీస్ రాగ్ మయూర్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఒక ప్రాజెక్ట్‌ను మొదటి నుంచి చివరి వరకు తన భుజాలపై వేసుకుని నడిపించగలనని ఈ సిరీస్‌తో ఆయన నిరూపించారు. దీనిపై రాగ్ స్పందిస్తూ.. "సివరాపల్లి సక్సెస్ తర్వాత నాపై నాకు నమ్మకం పెరిగింది. ఇప్పుడు చాలా మంది దర్శకులు నా కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నామని చెప్తుంటే ఒక నటుడిగా గర్వంగా అనిపిస్తోంది" అని అన్నారు.

గతేడాది సమంత నిర్మాణంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'శుభం' లో రాగ్ మయూర్ ఒక చిన్న క్యామియో పాత్రలో మెరిశారు. పాత్ర చిన్నదైనా ఆ ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే పడింది. అలాగే అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో వచ్చిన 'పరదా' చిత్రంలో 'రాజేష్' అనే వైవిధ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. ఇక 'మిత్ర మండలి' అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఆయన పలికిన ఇంగ్లీష్ వన్‌లైనర్స్ సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా మారి, విపరీతంగా వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం రాగ్ మయూర్ డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము తెరకెక్కిస్తున్న 'గరివిడి లక్ష్మి' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన మునుపెన్నడూ చూడని విధంగా ఒక 'బుర్రకథ కళాకారుడి' పాత్రలో కనిపించబోతున్నారు. ఇది నా కెరీర్‌లోనే అత్యంత ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ రోల్. ఈ పాత్ర సహజంగా రావడం కోసం ఎంతో హోంవర్క్ చేసి, ప్రిపేర్ అయ్యాను అని రాగ్ మయూర్ వెల్లడించారు. నా కెరీర్ ప్రారంభంలోనే అగ్రశ్రేణి దర్శకులు, గొప్ప టెక్నీషియన్స్‌తో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. భవిష్యత్తులోనూ ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే నా ఫస్ట్ ఛాయిస్ అని రాగ్ మయూర్ చెప్పుకొచ్చారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+