పీకల్లోతు ఇరుక్కుపోయిన బండి భగీరథ్, ఆ సెక్షన్ చేర్చటంతో టెన్షన్, తేడా వస్తే జీవితఖైదే!
తెలంగాణా రాష్ట్రంలో బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో మైనర్ యువతిపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో అరెస్టు చేయబడిన బండి భగీరథ్ కేసు ఊహించని ములుపులు తిరుగుతోంది. పేట్ బషీరాబాద్ పోలీసులు తాజాగా కేసులో కొత్తగా ఒక కఠిన సెక్షన్ జోడించారు. దీంతో భగీరథ్‌కు జీవిత ఖైదు శిక్ష పడే పరిస్థితి ఏర్పడింది.
కేసులో కొత్త సెక్షన్ చేర్చిన పోలీసులు
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(2)(m)ను కేసులో చేర్చారు. ఒకే వ్యక్తి ఒక మహిళపై పలుమార్లు అత్యాచారం చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్ వర్తింపజేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధించవచ్చు.

లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్
ప్రస్తుతం భగీరథ్‌పై BNS 64(2)(m), BNS 74, 75 మరియు POCSO సెక్షన్ 5(1) r/w 6 కింద కేసు నమోదు చేశారు. మే 8న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ బండి భగీరధ్ పై నమోదైన పోక్సో కేసులో లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఫోరెన్సిక్ ల్యాబ్ కు బండి భగీరధ్ ఐఫోన్
మే 16న భగీరథ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి ఐఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోన్‌లోని చాట్స్, మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు మరియు సీసీటీవీ ఫుటేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చే సరికి కేసులో మరిన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
భగీరధ్ స్నేహితులను విచారించనున్న సిట్
ఈ కేసులో భగీరథ్ స్నేహితుల పాత్ర కూడా ఉందని, పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో స్నేహితులు అక్కడ ఉన్నట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఘటన బయటకు రాకుండా చేయడానికి, రాజీ కుదుర్చడానికి వారు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. దాదాపు 10 మంది స్నేహితులను సిట్ పోలీసులు త్వరలో విచారించనున్నారు.













Click it and Unblock the Notifications