అది చంద్రబాబు మానసపుత్రిక.. అందుకే ఆ రైతులకు శుభవార్త!

ఆక్వా రైతులకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జోన్, నాన్‌జోన్‌తో సంబంధం లేకుండా, పదెకరాల పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఆక్వా రైతుకూ యూనిట్ విద్యుత్‌ను రూ.1.50 కి అందించేందుకు జీవో నెం.57ను రైతుల సమక్షంలోనే విడుదల చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.

అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం

పాలకొల్లులో నిర్వహించిన భారీ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం 26 నెలల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశామని అన్నారు. రైతాంగ సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.

AP CM Chandrababu announces 1 50 per unit electricity for Aqua farmers without zone non-zone limits

ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్

ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా జోన్, నాన్‌జోన్, పదెకరాల పరిమితితో సంబంధం లేకుండా రూ.1.50 యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఈ రంగంపై సుమారు రూ.724 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో విద్యుత్ సబ్సిడీకి రూ.1,150 ఖర్చు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో జీవో తీసుకొచ్చి రైతుల ముందే విడుదల చేశామన్నారు.

బ్లూ ఎకానమీ గురించి మంత్రి అచ్చెన్నాయుడు

దేశం, ప్రపంచం ఇప్పుడు బ్లూ ఎకానమీ గురించి మాట్లాడుతోందని, ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ఇచ్చిన వరమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే ఆక్వా, మత్స్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు తిరుగుండదన్నారు. ఆక్వా రంగం చంద్రబాబు నాయుడి మానస పుత్రిక. ఈ రంగాన్ని బతికించడమే కాదు.. దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఆక్వా రంగంలో ప్రధాన సమస్యలు ఇవే

విదేశాల్లో తీసుకునే నిర్ణయాలు, ఫీడ్ ధరల పెరుగుదల, విద్యుత్ వ్యయం, ఆక్వా ఉత్పత్తుల ధరలు పడిపోవడం, ఎగుమతుల్లో ఇబ్బందులు వంటి సమస్యలు రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయని మంత్రి తెలిపారు. అమెరికాకు వెళ్లే భారతీయ రొయ్యలపై భారీగా టారిఫ్‌లు విధించడంతో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించి రైతులకు ధైర్యం ఇచ్చారని పేర్కొన్నారు.

అనేక సవాళ్ళ మధ్య ఆక్వా రంగ వృద్ధి

సవాళ్ల మధ్య కూడా 16 శాతం వృద్ధి తగ్గకుండా రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రుల సమావేశాల్లోనే కూర్చోబెట్టి సమస్యలను నేరుగా వివరించే అవకాశం కల్పించామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణ కోసం రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత వర్గాలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇకపై ధరలు పెంచాలన్నా, తగ్గించాలన్నా కమిటీ పరిశీలన, సంబంధిత వర్గాల ఆమోదంతోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సేవలకు ముహూర్తం ఫిక్స్!
భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సేవలకు ముహూర్తం ఫిక్స్!

ట్రాన్స్‌ఫార్మర్ల సబ్సిడీ తొలగించింది వైసీపీనే

2014-19 మధ్య తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు తక్కువ వ్యయంతో ట్రాన్స్‌ఫార్మర్లు అందించామని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫార్మర్ల సబ్సిడీని తొలగించి రైతులపై భారం మోపిందని విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీ ఆక్వా రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరమన్నారు.ఆక్వా యూనివర్సిటీని గాడిలో పెడుతున్నామని, ఆక్వా రైతులకు అడుగడుగునా అండగా ఉంటున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+