యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్
తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థికీ ప్రపంచ స్థాయి విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భవనాలు నిర్మించడం సులభమేనని.. అయితే విద్యార్థుల కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలని పేర్కొన్నారు. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ.. కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే గీతలను చెరిపేస్తూ.. ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మాణం అవుతున్న విద్యాలయాలు.. పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయని తెలిపారు.
భవనాలు నిర్మించడం సులభమే... కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి.
— Revanth Reddy (@revanth_anumula) August 11, 2026
ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ... కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే… pic.twitter.com/m8GCxv7NQD
పేద పిల్లల కలలకు చిరునామాగా.. తెలంగాణ మోడల్ కు ప్రతీకగా.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తరతరాల భవిష్యత్తును మార్చబోతున్నాయని సీఎం రేవంత్ తన అధికారిక ఎక్స్ మాధ్యమం ద్వారా పోస్టు పెట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 105 పాఠశాలలను నిర్మించనున్నారు. ఒక్కో స్కూల్ లో దాదాపు 2,605 మందికిపైగా విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలల్లో విద్యను అందించనున్నారు.

ఒక్కో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం 25 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ మేరకు ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ. 200 కోట్లు కేటాయించనుంది. అత్యాధునిక వసతులతో నిర్మాణాలు జరగనున్నాయి. ఒక్కో పాఠశాల 5.36 లక్షల స్క్వేర్ ఫీట్ పరిమాణంలో ఉండనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ఎక్స్ మాధ్యమం వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న యంగ్ ఇండియా స్కూల్స్ పై విశ్లేషణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications