కాశీ వెళ్ళే తెలుగువారికి శుభవార్త.. తక్కువ ధరకే గదులు, ఫ్రీ భోజనం!

వారణాసి వెళ్లే తెలుగు భక్తులకు సువర్ణావకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దండు త్రినాధ రాజు అనే వ్యక్తి వారణాసిలో 'డొక్కా సీతమ్మ ఆశ్రమం'ను స్థాపించి తన సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. గంగా నది పక్కన హనుమాన్ ఘాట్ సమీపంలోని ఆవాదగర్భి ప్రాంతంలో ఐదు నెలల క్రితం ప్రారంభమైన ఈ ఆశ్రమం తెలుగు యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు అందిస్తోంది.

డొక్కా సీతమ్మ పేరుతో వారణాశిలో ఆశ్రమం

డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన మహిళ. ఆమె సేవా భావనను స్మరించుకుని ఈ ఆశ్రమానికి ఆమె పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఆమె సేవలను గౌరవించింది. అదే స్ఫూర్తితో దండు త్రినాధ రాజు వారణాసిలో ఈ ఆశ్రమం ద్వారా అన్నదానం మరియు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Dokka Seethamma Ashram in Varanasi with low cost rooms and free food Good news to telugu people

తెలుగురాష్ట్రాల నుంచి వచ్చేవారికి మొదటి ప్రాధాన్యత

పాలకొల్లు సమీపంలోని కాపవరం గ్రామానికి చెందిన త్రినాధ రాజు గొప్ప సేవా స్పూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వారణాసి వంటి పవిత్ర నగరంలో తెలుగు వారికి సౌకర్యవంతమైన వసతి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రూ.15లక్షలు ఖర్చు చేసి భవనాన్ని మెరుగుపరిచారు. ఆశ్రమంలో భోజనం పూర్తిగా ఉచితం. వసతి గదులు చాలా తక్కువ అద్దెకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు, యాత్రికులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

వారణాశిలో తెలుగు భక్తులకు పెద్ద బహుమతి

ఈ ఆశ్రమం ద్వారా ఎంతోమంది యాత్రికులు ఆర్థిక భారం లేకుండా వారణాసి దర్శనం చేసుకోవడం సాధ్యపడుతోంది. గంగా స్నానం, కాశీ విశ్వనాథ దర్శనం, అన్నదానం - ఇవన్నీ ఒకేచోట అందుబాటులో ఉండటం తెలుగు భక్తులకు పెద్ద బహుమతి. ఈ ఆశ్రమంపై త్రినాధ రాజు మాట్లాడుతూ, "వారణాసిలో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం చేయాలని చాలా కాలంగా కోరుకున్నాను. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

బండి భగీరథ్‌‌ పోక్సో కేసు: ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు షాక్!
బండి భగీరథ్‌‌ పోక్సో కేసు: ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు షాక్!

తెలుగువారి సేవాదృష్టికి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు

ఈ ఆశ్రమం స్థాపనతో తెలుగు వారి సేవా దృష్టి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వారణాసి వెళ్లే తెలుగు యాత్రికులు ఇకపై ఆర్థిక ఇబ్బందులు లేకుండా, మనసు ఉల్లాసంగా ప్రయాణం చేయవచ్చు. దండు త్రినాధ రాజు లాంటి సహృదయులు సమాజంలో ఇంకా ఎంతోమంది ఉన్నారనడానికి ఇలాంటి ఆశ్రమాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.భక్తి, సేవ, మానవత్వం మూడింటినీ ఒక్క చోట కలిపిన ఈ ఆశ్రమం త్వరలోనే మరిన్ని సేవలను విస్తరించాలని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+