హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శనకు తెలంగాణలో ఆటంకాలు తప్పలేదు. అదుర్స్ సినిమా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. తెలంగాణవాదులు సమైక్యవాదులకు చెందిన అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే, తగిన భద్రత కల్పించి సినిమా ప్రదర్శనకు ఆటంకం కలగకుండా చూడాలని హైకోర్టు రాష్ట్ర డిజిపిని ఆదేశించింది. దీంతో తెలంగాణలోని థియేటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణవాదుల వ్యతిరేకతతో వరంగల్ లోని రామ్, విజయ థియేటర్లలో అదుర్స్ సినిమా ప్రదర్శనను నిలిపేశారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని శ్రీనివాస థియేటర్ లో కూడా సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నల్లగొండ తిరుమల థియేటర్ లో అదుర్స్ ప్రదర్శనను అడ్డుకోవడానికి తెలంగాణ ఆందోళనకారులు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి