విజయ్ దేవరకొండ భారీ రిస్క్!

వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ, 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా హాలీవుడ్ టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. దీంతో ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో వస్తున్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు సమాచారం.

కృతి సనన్.. టాలీవుడ్ ఐరన్ లెగ్గా?
కృతి సనన్‌ను హీరోయిన్‌గా ఎంచుకోవడంపై టాలీవుడ్ వర్గాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. దీనికి కారణం ఆమె గతంలో నటించిన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. మహేశ్ బాబుతో సుకుమార్ దర్శకత్వంలో చేసిన '1: నేనొక్కడినే' అప్పట్లో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్య సరసన నటించిన 'దోచేయ్' కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలతో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఆమెను తీసుకోవడం పెద్ద రిస్క్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Vijay Deverakonda and Kriti Sanon to Team Up A Bold Risk for the Rowdy Hero Next Film Details

బాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్
తెలుగులో విజయాలు లేకపోయినా కృతి సనన్ బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన గ్లామర్, నటనతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో తెలుగులో ఇబ్బంది పడినప్పటికీ.. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ కోణంలో చూస్తే విజయ్-కృతి జోడీ సినిమాకు మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయ సరిహద్దులు దాటి సినిమాకు గుర్తింపు తీసుకురావడంలో ఆమె తోడ్పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ కెరీర్‌కు కీలకమైన సమయం
వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రణబాలి', 'రౌడీ జనార్దన్' వంటి భారీ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శౌర్యువ్-కృతి సనన్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది. వైరా ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. మరి మహేశ్, నాగచైతన్యలకు అందని విజయం విజయ్ దేవరకొండకు ఈ జోడీతో దక్కుతుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+