చిరంజీవిని అవమానించిన స్టార్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు, ఎదుర్కొన్న ఛీత్కారాలు గుండెను బరువెక్కించేలా ఉంటాయి. వాటిని ఆయన ఎదుర్కొన్న తీరు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ప్రస్తుతం చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్. కానీ, కెరీర్ ఆరంభంలో ఆయన ఒక సామాన్య నటుడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం ప్రతిభను నమ్ముకుని చెన్నై వీధుల్లో తిరిగిన ఒక యువకుడు. నాడు ఆయనకు ఎదురైన అవమానాలే నేడు మెగాస్టార్ గా మారడానికి పునాదులు వేశాయి.

నువ్వేమైనా స్టార్ హీరోవా?

చిరంజీవిని హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో 'న్యాయం కావాలి' ఒకటి. ఆ సినిమా షూటింగ్ సమయంలో సెట్‌లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. తన షాట్ కోసం బయట వేచి చూస్తున్న చిరంజీవిని అసిస్టెంట్ డైరెక్టర్ పిలవగానే, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లి కోర్టు బోనులో నిలబడ్డారు. అప్పుడు ఆ చిత్ర నిర్మాత, అప్పటి స్టార్ డైరెక్టర్ క్రాంతి కుమార్ అందరి ముందు చిరంజీవిపై విరుచుకుపడ్డారు. నువ్వేమైనా స్టార్ హీరో అనుకుంటున్నావా? షాట్ ఉన్నా లేకున్నా ఇక్కడే పడి ఉండాలని తెలియదా? జగ్గయ్య, శారద వంటి సీనియర్లు ఇక్కడే ఉన్నారు కదా.. వాళ్ళను చూసి నేర్చుకో! అంటూ అరిచారు. ఆ మాటలకు చిరంజీవి కుంగిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. కానీ, సాయంత్రం ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. నన్ను స్టార్ హీరోవా అని కదా అడిగారు.. యస్, నేను స్టార్ హీరో అయ్యి చూపిస్తాను అని మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆ అవమానాన్ని ప్రతీకారంగా కాకుండా, పట్టుదలగా మార్చుకొని మెగాస్టార్ అయ్యారు.

Chiranjeevi Insulted By Top Director During a Movie Shoot Rise from Setback to Megastar

క్రియేటివ్ సలహా ఇచ్చినందుకు దక్కిన ఛీత్కారం

మరో సందర్భంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, క్రాంతి కుమార్ నిర్మాతగా 'శివుడు శివుడు శివుడు' షూటింగ్ జరుగుతోంది. ఒక సన్నివేశం గురించి చిరంజీవి ఒక చిన్న సలహా ఇస్తే, దర్శకుడికి అది నచ్చింది. కానీ నిర్మాత మాత్రం అక్కడికి వచ్చి.. డైరెక్టర్ నువ్వా లేక ఆయనా? హీరో చెబితే వినేస్తావా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అవమానం ఎంతలా పని చేసిందంటే, ఆ తర్వాత దర్శకుడు కోదండరామిరెడ్డి ఆ బ్యానర్ నుంచి తప్పుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం తన పని తాను చేసుకుంటూ, నిర్మాతలతోనూ, దర్శకులతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తూ ప్రొఫెషనలిజం చాటుకున్నారు.

థియేటర్ లోసీటు నుంచి లేపేసిన వైనం

అవకాశాల కోసం చెన్నైలో అద్దె గదిలో ఉంటున్న రోజుల్లో.. ఒక సినిమా ప్రివ్యూకి వెళ్లిన చిరంజీవికి ఘోర అవమానం ఎదురైంది. తన స్నేహితులతో కలిసి సినిమా చూస్తుండగా, మధ్యలోనే వారిని లేపేసి.. ఈ సీట్లు మీ కోసం కాదు, వీఐపీల కోసం అని అక్కడి నుంచి పంపించేశారు. ఆ రోజు తన సొంత తమ్ముడు నాగబాబు దగ్గర చిరంజీవి తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎలాగైనా గొప్ప హీరో అవ్వాలి అని శపథం చేశారు. అవమానించిన వారే అభినందించేలా ఎదగడమే అసలైన గెలుపు అని చిరంజీవి నిరూపించారు. ఒకప్పుడు సెట్ నుంచి గెంటేసినవారు, సీట్ల నుంచి లేపేసినవారే నేడు ఆయన డేట్స్ కోసం వేచి చూసేలా ఎదిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+