మొత్తానికి సినిమా హిట్ కొట్టావ్ అన్నా..!
ఈ రోజుల్లో చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా హిట్ కోసం శ్రమిస్తున్నారు. కథలో దమ్ము ఉంటే తప్పా ఇటీవలికాలంలో సినిమాలు హిట్ కావడం లేదు. ప్రస్తుతం రీరిలీజ్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. కొత్త సినిమాలను పట్టించుకోవడమే మానేశారు. హిట్ అయితే తప్ప ఆ సినిమావైపు చూడడం లేదు. అలాంటి నేపథ్యంలో గతేడాది వరుసగా మూడు హిట్స్ కొట్టి తన సత్తా చాటాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. తన విలక్షణమైన నటనతో సాధారణ సినిమాకు కూడా ప్రాణం పోయడం ఆయన స్పెషాలిటీ. గతేడాది కుబేర, ఇడ్లీకొట్టు, తేరే ఇష్క్ మెయిన్ లాంటి చిత్రాలతో వరస హిట్స్ కొట్టాడు. ఈ ఏడాది కర మూవీతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ముందుకొచ్చాడు. తాజాగా కర మూవీతో మరో హిట్ కొట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
కర మూవీని రైతుల సమస్యలు, ముఖ్యంగా లోన్ల విషయంలో జరిగే మోసాలను ప్రధానంగా చేసుకుని రూపొందించారు. కమర్షియల్ యాంగిల్ లో మిశ్రమ స్పందన ఉన్నా ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అయితే ధనుష్ గత సినిమాలతో పోల్చితే కాస్త డల్ గానే ఉన్నా.. ఇప్పుడున్నపరిస్థితుల్లో దీనికి బెటర్ గానే వసూళ్లు రావడం విశేషం అని చెప్పొచ్చు. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్లు పెరగడం మరో విశేషంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ధనుష్ కర మూవీకి తొలిరోజు ఇండియాలో రూ. 6. 25 కోట్ల నెట్ వచ్చింది. అలాగే రెండోరోజు రూ. 6.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఓవరాల్ గా ఇండియాలో కర మూవీ రూ. 15.30 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రెండురోజుల్లో దాదాపు 20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు స్పష్టం అవుతోంది. దీన్నిబట్టి చూస్తే కర సినిమా హిట్ కొట్టినట్టుగానే చెప్పొచ్చు. ఇక శని, ఆదివారాల్లో ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర మూవీని విజ్ఞేష్ రాజా తెరకెక్కించారు. ఈ మూవీలో ధనుష్ సరసన మమితాబైజు హీరోయిన్ గా నటించింది.












Click it and Unblock the Notifications