ఆదిలాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఆట, పాటల సీడీలు ఇటీవల పెద్ద ఎత్తున బోథ్ నియోజకవర్గంలో అమ్ముడుపోతున్నాయి. వివిధ కళాబృందాలు రూపొందించిన క్యాసెట్లు, సీడీలు మార్కెట్‌లో చలామణి అవుతున్నాయి. నెల రోజుల నుంచి భారీగా ఈ క్యాసెట్లు అమ్ముడు పోతున్నాయని సీడీ దుకాణాల యజమానులు పేర్కొంటున్నారు. ఎంతటి ధరనైనా పెట్టి వీటిని కొనుగోలు చేస్తున్నారని తెలి పారు.
ప్రతి గ్రామీణప్రాంతాల్లో, గడ పగడపలో ప్రస్తుతం తెలంగాణ పాటలే వినిపిస్తున్నాయి. అలాగే సెల్ ఫోన్లలో సైతం తెలంగాణ పాటలు రింగ్ టోన్ లుగా మారు మోగుతున్నాయి. మరోవైపు దీక్ష శిబిరాల వద్ద నలుగురు నిలుచున్న చోట ఒకరికొకరు జై తెలంగాణ..జైజై తెలంగాణ అంటూ కరచాలనం చేసుకుంటున్నారు. ఉద్యమానికి మరింత ఊపుతెచ్చే ఈ ప్రక్రియకు అందరూ చేయూత నిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి