సూళ్లూరుపేట: చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండల పరిధిలోని కల్కి ఆశ్రమవాసులు ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆశ్రమవాసి లోకేష్‌దాష్ దాసాజీ కథనం మేరకు సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన వేనాటి పవన్‌కుమార్ (27), విజయనగరానికి చెందిన దుర్గా వికాస్ (31) ఒకేరకమైన గాయాలతో మృతి చెందివున్నారు. వీరిలో పవన్ 8 సంవత్సరాలుగా, వికాస్ 12 సంవత్సరాలుగా కల్కి ఆశ్రమంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరదాయపాళెం మండలం బత్తులవల్లం సమీపంలోని విఠలాయపాళెం రోడ్డుపై వాహన ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం రాత్రి అమ్మాజీ ఆశ్రమం నుంచి విశ్రాంతి గదుల వద్దకు మోటార్ సైకిల్‌పై వెళుతుండగా, వీరిని గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్టు ఓ ఆటో డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు.
హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోగా కొనఊపిరితో వికాస్ కనిపించాడు. పవన్ అప్పటికే మరణించాడు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా వీరిద్దరిని ఆశ్రమ అంబులెన్స్‌లో సూళ్లూరుపేటకు తరలించారు. పవన్ శవాన్ని ఇంటి వద్ద దింపేసి, వికాస్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. కానీ, రాత్రి 9-15 గంటల సమయంలో ఇద్దరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకొచ్చారని అప్పటికే వారు మృతిచెందడంతోచికిత్స చేయలేదని ఆసుపత్రి వైద్యులు సాయిబాబా, మస్తానమ్మ తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి