డిజిపిపై తెలంగాణ నేతలు గరం

Girish Kumar
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుందన్న డిజిపి గిరిష్ కుమార్ వ్యాఖ్యపై తెలంగాణ రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిపి బాధ్యతను విస్మరించి వ్యాఖ్యలు చేశారని వారంటున్నారు. డిజిపి వ్యాఖ్యను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యతిరేకించారు. డిజిపి ఉద్దేశం అలాంటిదై ఉండదని ఆయన అన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని ఆయన కోరారు. డిజిపి చేసిన వ్యాఖ్యలాంటివి ప్రత్యేకమైన పరిస్థితి ఉన్న ప్రస్తుత తరుణంలో అనవసరమైన ఉద్రేకాలు పెరుగుతాయని ఆయన అన్నారు. కాగా, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు డిజిపిపై తీవ్రంగా మండిపడ్డారు.

రాజకీయాలు మాట్లాడాలనుకుంటే గిరీష్ కుమార్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని తెలుగుదేశం, తెరాస నాయకులు ఆయనకు సూచించారు. డిజిపి బాధ్యతారహితంగా మాట్లాడారని వారన్నారు. తెలంగాణ ప్రజలకు డిజిపి క్షమాపణ చెప్పాలని తెరాస నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి డిజిపి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో నక్సల్స్ లేరని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా డిజిపి మాట్లాడారని ఆయన అన్నారు. డిజిపి రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదని తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు.

డిజిపి వ్యాఖ్యలను తెలుగుదేశం నాయకుడు వేణుగోపాలాచారి ఖండించారు. ఉన్నత పదవిలో ఉన్న డిజిపి రాజకీయ నాయకుడిలా మాట్లాడడం తగదని ఆయన అన్నారు. ఓయు ఉద్యమంలో నక్సలైట్లు ఎవరూ లేరని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలను డిజిపి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+