సినిమాలను అడ్డుకుంటే తప్పేమిటి: రాజేందర్

తెలంగాణపై అస్పష్టమైన కేంద్ర ప్రకటన వల్లనే్ విద్యార్థులు అత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 189 మంది బలిదానం చేశారని ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ ప్రాంతం అగ్ని గుండం అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న బలిదానాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా ఆయన అడిగారు. విద్యార్థులపై కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు బాధ్యతను విస్మరిస్తోందని ఆయన అన్నారు. రాజీనామాలకు, రాజకీయ సంక్షోభానికి కారణం కేంద్రం ఇచ్చిన మాటను తప్పడమేనని ఆయన అన్నారు. పేద పిల్లల బలిదానాలను చూసైనా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టంగా ముందుకు రావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
కాగా, నిజామాబాద్ జిల్లా కొమ్మరపల్లి మండలం బషీరాబాద్ లో నరేందర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాదని మనస్తాపానికి గురై నరేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెప్పారు.