హైదరాబాద్: బంద్ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం వాయిదా పడడంతో తెలంగాణ తెలుగుదేశంపార్టీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భవన్‌లో సమావేశం అయ్యారు.ఉస్మానియాలో ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, తెలంగాణ నేతల రాజీనామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితి తదితర వాటిపై చర్చలు జరిపారు. అలాగే గురువారం జరగనున్న టీడీపీ విస్తృత కార్యవర్గ సమావేశం కూడా వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
ఇలా ఉండగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఆమోదించాలని, రాజీనామాలు ఆమోదించే విషయంలో స్పీకర్ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్నారని ఆపార్టీ ఢిల్లీ చర్చల ప్రతినిధి రేవూరి ప్రకాష్‌రెడ్డి వరంగల్‌లో ఆరోపించారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఇబ్బందిలేకుండా మేడారం జాతరకు వెళ్లే బస్సులకు మినహాయింపు నిచ్చినట్లు రాజకీయపార్టీల జేఏసీ తరుపున రేవూరి ప్రకటించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి