హైదరాబాద్: రేపు కూడా జరుపతలపెట్టిన బంద్ ను తెలంగాణ జెఎసి ఉపసంహరించుకుంది. రేపు అంటే గురువారం బంద్ ఉండదని స్పష్టం చేసింది. మేడారం జాతర సందర్భంగా భక్తుల సౌకర్యం కోసం సమ్మె పిలుపును వెనక్కి తీసుకుంటున్నట్టు బుధవారం సాయంత్రం ప్రకటించింది. 48 గంటల సమ్మెల కారణంగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను జెఎసి మేధావులు గుర్తించినట్టుగా కన్పిస్తోంది. బస్సులు లేక సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పొట్టగడవక ఆటో డ్రైవర్లు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. వైద్య్ సేవలకు వెళ్ళలేక రోగులు ఆపసోపాలు పడుతున్నారు.
బంద్ ను ఉపసంహరించుకున్నామని, అయితే హైదరాబాద్ లోని ఇతర తెలంగాణ జిల్లాల్లోను నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని జెఎసి నాయకులు చెప్పారు. తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాదేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తూ నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన అనిల్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అనిల్ మృతి పట్ల తెలంగాణ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి