తెలంగాణ ఉద్యమం వెనక తీవ్రవాదులు: కావూరి సాంబశివరావు

Kavuri Sambhasiva Rao
భీమవరం: విద్యార్థుల ముసుగులో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమాన్ని తీవ్రవాదులే నడిపిస్తున్నారని కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు వ్యాఖ్యానించారు. ఉస్మానియాలో జరుగుతున్నవి విద్యార్థి ఉద్యమాలు కావని ఆయన భీమవరంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలోని 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు. ఉద్యమాన్ని బయటివారు బలవంతంగా నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు.

విద్యార్థులు పరీక్షలు రాయడానికి ముందుకు వస్తున్నా రాయలేని పరిస్థితులు కల్పించారని ఆయన అన్నారు. నినాదాలు, బ్లాక్ మెయిల్, భాష వంటి విషయాలు చూస్తుంటే ఒయులోని ఉద్యమం విద్యార్థులు నడిపించడం లేదని తెలుస్తుందని ఆయన అన్నారు. ఉద్యమాలు ప్రాంత, ప్రజా సంక్షేమం కోసం జరిగితే ఫరవా లేదని, అందుకు భిన్నంగా జరగడం మంచిది కాదని ఆయన అన్నారు. తల్లిదండ్రులు చెమటోడ్చి విద్యార్థులను చదివిస్తుంటే వారిని పాడు చేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+