తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసే: పాల్వాయి గోవర్దన్ రెడ్డి

యుపిఎ, కాంగ్రెసు పార్టీ కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని పార్టీలు యు టర్న్ తీసుకున్నాయని, అందుకే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రా పెత్తనం ఉన్నంత వరకు తెలంగాణ తీర్మానం ఆమోదం పొందదని, చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications