ఎపి దేశానికే ఆదర్శం కావాలి: గవర్నర్

శాంతిసామరస్యాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. శాంతిప్రక్రియ కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన అన్నారు. మావోయిస్టులను అరికట్టడంలో ప్రభుత్వం సఫలమైందని ఆయన చెప్పారు. మావోయిస్టులను అరికట్టడంలో రాష్ట్రం ట్రెండ్ సెటర్ గా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ విషయంలో గ్రేహౌండ్స్ పాత్ర ప్రశంసనీయమని ఆయన అన్నారు. బహుముఖ పద్ధతుల ద్వారా మావోయిస్టు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తోందని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాస పథకం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications