రేపటి నుంచి మేడారంలో రోజుకు 20 లక్షల మంది

Warangal
వరంగల్‌: జాతరకు ముందే మేడారంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 15 రోజుల్లో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి కూడా భక్తులు తరలొస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా భక్తుల తాకిడి మరింత పెరిగింది. రెండు ఆదివారాల్లో సుమారు మూడు లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మంది సమ్మక్క-సారలమ్మల గద్దెలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 27 నుంచి 30 వరకు జాతర జరగనుండగా 80 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. జాతర సందర్భంగా రద్దీ ఎక్కువ ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తూ భక్తులు ఇప్పటి నుంచే మేడారాన్ని సందర్శించుకుంటున్నారు.

జాతరలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వీటిని పర్యవేక్షించేందుకు 500 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించారు. మూడు వేల మంది సిబ్బంది భక్తుల సేవల్లో నిమగ్నమయ్యారు. భక్తుల బ్యారక్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, ఆర్టీసీ పాయింట్లు తదితర బాధ్యతల పర్యవేక్షణ కోసం 6500 మంది పోలీసు సిబ్బంది పని చేస్తున్నారు. ఆర్టీసీ 2700 బస్సు సర్వీసులు నడుపుతోంది.

గత బుధవారం నుంచి ఇప్పటి వరకు 1200 బస్సు ట్రిప్పుల ద్వారా భక్తులను ఆర్టీసీ మేడారానికి చేరవేసింది. అలాగే వేలాది ప్రైవేటు వాహనాల్లో భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. 27న సారలమ్మ, 28న సమ్మక్క గద్దెలకు చేరనున్నారు. దీంతో భక్తుల తాకిడి బాగా పెరుతుంది. 29న మొక్కల సమర్పణ మొదలుకుని 30న సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేసే వరకూ భక్తజనంతో మేడారం పోటెత్తనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+